CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 685

కృపాసింహాసనుండా అల్ఫా ఓమేగా నీవేగా

krupaasinhaasanundaa alphaa omegaa neevegaa

Revelation 21:5

More
Reference recording on YouTube ↗
పల్లవి:కృపాసింహాసనుండా (1)- అల్ఫా ఓమేగా నీవేగా (1)కృపాసింహాసనుండా - కృపా దాపునజేరి నుతించెద (2)
1. ఇదిగో సమస్తమును - నూతనముగ చేయుచున్నాను (2) ఇదిగో సమస్తమును (1) - మోదంబు గలుగజేసెద (2)
2. దైవవాక్యము గైకొని - జీవించిజయించువాని దైవవాక్యము గైకొని - దేవాలయ స్తంభముగా జేతున్
3. దావీదు తాళము గలిగి - నా దేవుని పేరు వ్రాసెద దావీదు తాళము గలిగి - దావీదు జీవింపజేతున్ నెపుడచట
4. సత్యస్వరూపిని నా - క్రొత్త పేరు వాని పై వ్రాతున్ సత్యస్వరూపిని నా - సత్యమునందు నడిపింతున్
5. పరలోకమును దిగివచ్చు - పరిశుద్ధ పట్టాణము పేరు పరలోకమును దిగివచ్చు - మురియుచు వానిపై వ్రాతున్
6. ఉత్తముడు యెహోవా - క్రొత్తగీతము పాడుడి ఉత్తముడు యెహోవా - పుత్రుడేసుని మన కొసగెన్
7. తండ్రికి ప్రియుడేసు - అండగ నుండెను తండ్రి తండ్రికి ప్రియుడేసు - మెండుగ నాత్మతో నిండెన్
8. సిలువపై ప్రాణమిడెను - విలువ సమాధి నుంచబడె సిలువపై ప్రాణమిడెను - గెలిచి లేచె సజీవుండై
9. ఘనుడైన ప్రియుడేసు - దీనుల యాదరించును ఘనుడైన ప్రియుడేసు - వినయముతో మనలను పిలిచెన్
10. ఉల్లంబులు రంజిల్లె - ఎల్లప్పుడు ప్రభు మనతో నుండ ఉల్లంబులు రంజిల్లె - హల్లెలూయ పాడెదము

Back to Hebron Seeyonu Geethalu