పల్లవి:దప్పిగొనిన వారలారా దప్పితీర్చుకొన రండి రండి (2)
అను పల్లవి:కాసు రూకలు లేకున్నను త్రాగను రండి (2) || దప్పి ||
1. యెషయా యిరువదియైదు ఆరవ వచనము చదివి (2) త్రాగుచు తృప్తి పొందను రండి రండి (2)
2. క్రొవ్విన పదార్థమును పాత ద్రాక్షారసమును క్రొవ్వు మెదడు గలవాటిని తినుటకు రండి
3. నేనే జీవపానమును - నేనే పరమాహారమును రూకలను వ్యర్థము చేయక - రండి రండి
4. నా శరీరమే పరమాహారం - నే చిందించిన రక్తమేపానం తిని త్రాగిన వారికి కల్గును నిత్యజీవం
5. ద్రాక్షారసము ఓదార్చున్ - జల్దరు తృప్తిపరచున్ నీకు నూనె ఉజ్జీవము నిచ్చున్నిచ్చున్
6. గొఱ్ఱెపిల్లలు దూడలును - తినువారికి చంపబడెను వ్యర్థసాకులను చెప్పక రండి రండి
7. సర్వసమృద్ధిలోన దేవుడున్నాడు రండి హల్లెలూయ పాటలుండును రండి రండి