పల్లవి:ఎల్ల వేళలందు - కష్టకాలమందు - వల్లభుండా యేసు స్తుతింతున్ (1)ఎల్లను నీవే నా కెల్లెడల - వల్లపడదే వివరింప (2)
1. విమోచకుడా - విమోచన మీవే - రక్షకుడవు - నా రక్షణ నీవే (2)
2. సృష్టికర్తవు - సహాయము నీవే - ఇష్టుడ వీవు - త్రిత్వము నీవే
3. జ్ఞానము నీవే - నా పానము నీవే - దానము నీవే - నా గానము నీవే
4. జ్యోతియు నీవే - నా నీతియు నీవే - ఆదియు నీవే - నా అంతము నీవే
5. నిత్యుడ నీవే - నా సత్యుండ నీవే - స్తోత్రము నీవే - నా నేత్రము నీవే
6. జీవము నీవే - నా దేవుడ వీవే - పావన మీవే - నా కావలి నీవే
7. కాంతియు నీవే - నా శాంతియు నీవే - సంతస మీవే - నా కంతయు నీవే