పల్లవి:సిలువను మోసి ఈలోకమును (1)తలక్రిందులు చేయు తరుణమిదే (2)
1. లేలెమ్ము సోదరుడానిద్ర నుండి - ప్రకటించను యేసు నామమును (2) సోమరి యేల నిద్రించెదవు - ఈ ధరను లేపెడు సమయ మిదే (2)
2. పరిశుద్ధాత్మ కవచము తోడిగి - నీ నడుము కట్టి తయ్యారగుమ సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి - సువార్తను చాటెడు సమయమిదే
3. లోకరక్షణకై ప్రభు యేసు - వీకతో నరుదెంచెను ఈ ధరకు వెలుగును మనకు నిచ్చెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే
4. పాతాళమునకు కొనిపోయెడి నీ - పాప నిద్రను విడనాడు మిక సిలువ మర్మము నెరుగుమిపుడే కునికెడు సమయము కాదిది ప్రియుడా
5. రక్షింపబడుట కాశించినచో - పశ్చాత్తాప పడు మీ దినమే కలుషాత్ముండా తడవేల నికన్ - కనుమా నీ తేర్పు సమయ మిదే