CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 610

పాప సముద్రమందు పగిలె నా హృదయనావ

paapa samudramandu pagile naa hrudayanaava

Mark 4:38

More
Reference recording on YouTube ↗
పల్లవి:పాప సముద్రమందు - పగిలె నా హృదయనావ (1)నావను దరికి యేసు - నడిపించు చక్కజేసి (2)
1. ప్రక్కలో కారిన రక్త - చుక్కల దర్శనమిమ్ము (2) నా తండ్రి నడుపు సత్య - నూతన మార్గమందు (2)
2. నజరేయుడా యేసు నీదు - నాణ్యంపు ముఖమును జూపి స్వస్థపర్చు రోగుల - సర్వజనుల బ్రతికించు
3. సీయోను పర్వత మహిమ - చూపించుము ఎల్లరికి నా హృదయముపైనున్న - నల్ల తెరను చింపుము
4. నా ప్రాణ ప్రియుడా యేసు - నా ప్రార్థన వినుమా సంపూర్ణునిగా చేయు - నీ చక్కని దర్శనమిచ్చి

Back to Hebron Seeyonu Geethalu