CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 608

కృప కనికరముల మా దేవా కృతజ్ఞతనర్పింతు

krupa kanikaramula maa devaa krutajnyatanarpintu

More
Reference recording on YouTube ↗
పల్లవి:కృప కనికరముల - మా దేవా - కృతజ్ఞతనర్పింతు (2)
1. యెహోవా చేసిన - ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును? (2) యెహోవా నామమున - ప్రార్థన జేసెదను (2) - రక్షణ పాత్రచేబూని (1)
2. యెహోవాకు నా - మ్రొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను యెహోవా ప్రజలలో - యెరూషలేములో - ఎల్లప్పుడు స్తుతింతు
3. తల్లి గర్భమున - రూపింపబడక మునుపే నన్ను - ఎరిగితివి తల్లి గర్భమునుండి - బయలుపడకముందే - ప్రతిష్టించితివి
4. పూర్ణ మనస్సుతో - నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి కరుణతో నీవే - నన్ను వెదకి - రక్షించితివి ప్రభువా
5. దూషకుడను - హింసకుడను హానికరుడనై యుంటిని దాసునిగా నన్ను - జేసికొంటివి - దోషముల బాపి
6. ఇది నీకొరకై - విరువబడిన నా శరీరమనియంటివి ఇది నీ పాప - క్షమకొరకై - చిందిన రక్తమంటివి
7. నీదు కృపతో - నాదు యేసు నన్ను నీవు - రక్షించితివి కాదునాదు - క్రియలవలన - ఇది దేవుని వరమే
8. చెప్పనశక్యము - మహిమా యుక్తము నీవొసంగిన - సంతోషము తప్పకుండ హల్లెలూయ - పాటపాడెదన్

Back to Hebron Seeyonu Geethalu