పల్లవి:యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుచున్నాను -నీపై నమ్మిక యుంచితిని - నన్నెన్నడు సిగ్గు పడనీయ్యకు (2)యెహోవా నీ దిక్కునకు నా ఆత్మను ఎత్తుచున్నాను (1)
1. ఎందరు నీకై కనిపెట్టెదరో - వారందరును సిగునొందరుగా (2) ద్రోహము చేయువారందరును (2) - తప్పక సిగ్గునొందెదరు (1)
2. అతిశయించుచున్నాను దేవా - నా హృదయమున నిన్ను బట్టి సంతోషింతురు దానిని వినగా - ఆత్మలో దీనులగువారు
3. ఉత్తరమిచ్చెను నా యెహోవా - తన యొద్దనే విచారణ చేయగ తప్పించెనుగా ఆయనే నన్ను - ప్రతివిధ భయములనుండియును
4. ఆయన తట్టు చూచెడువారికి - ధీటైన వెలుగు కలుగును గాన లజ్జింపకుండును వారి ముఖంబులు - ఎన్నటెన్నటికైన నా దేవా
5. యధార్థహృదయులందరిని దేవా - బలపరచుటకై నీకనుదృష్టి సంచారము చేయు లోకమంతటను - సంక్షేమమును కోరినదై
6. యెహోవా నాకిల సహాయుడవై - నన్నాదరించు చున్నావు నీవు చూపుము నాకు శుభ సూచనను - నా పగవారు సిగ్గు నొంద
7. హృదయ పూర్తిగా చెల్లించెదను - వందిత నీకు నా కృతజ్ఞతలు నిత్యము నేను నీ నామమును - మహిమపరతును నాప్రభువా