CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 603

ప్రార్థించుము నీ జీవితములో

praarthinchumu nee jeevitamulo

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రార్థించుము నీ జీవితములో - నెమ్మది సుఖము లొందెదవు (2)సంపూర్ణ భక్తిని కలిగించును - క్షేమములెన్నో పొందెదవు (2)
1. యెడతెగక నీవు ప్రార్థించినా - విసుగక నీవు ప్రార్థించినా (2) సమస్తమును నీవు పొందెదవు - తప్పక న్యాయము పొందెదవు (2) నీ కొరకై ప్రభు వేచియున్నాడు - ప్రార్థనలో కనిపెట్టుము (2)
2. కష్టము నష్టము కలిగినను - శోధన బాధలు వచ్చినను సాతాను నీపై విజృంభించి - నిన్ను గాయపరచినను భయపడకుము ప్రభువే నీకు - జయము నిచ్చును
3. ప్రభువే మనతో సెలవిచ్చెను - మెళకువగా నుండి ప్రార్థించు మని విశ్వాసము కోల్పోయే దినములలో - విశ్వాసముతో ప్రార్థించినా సాతాను దుర్గములను - పడగొట్టి - బలము పొందెదవు
4. ప్రభువచ్చు వేళాయే గమనించుము - ఆత్మ వలన ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన చేయుచు - పూర్ణమైన పట్టుదలతో పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు - మెళకువగా నుండుడి
5. యెరూషలేము క్షేమముకై - అన్యజనుల రక్షణకై భారముతో నీవు ప్రార్థించిన - ప్రభువే నీకు ఫలమిచ్చును వారి క్షేమమే నీ క్షేమమునకు - ఆధారమగును

Back to Hebron Seeyonu Geethalu