పల్లవి:విలపింతువా నెహెమ్యావలె? - విలపింతువా ఎజ్రావలె? (2)కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో (1)పడిపోయిన ప్రభుని యింటిని గూర్చి విలపింతువా? (2)
1. ఆత్మీయ గ్రహింపు లేకయే - ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి (2) ఎటుచూచిన ప్రభు యిల్లు పడిపోయెను - ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి (2)
2. అగ్నిచే కాల్చబడిన గుమంబులన్ - పడిపోయిన ప్రాకారమున్ పునఃనిర్మించి నిందను తొలగించెదమా? ప్రభు హస్తంబుతోడుండగన్
3. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో - ఆత్మకలిగించు ఐక్యతతో ఒకరినొకరు క్షమించి, సహించుచు - ప్రభు ప్రత్యక్షత పొందెదమా?
4. నెహెమ్యావలె హృదయంబుల చింపుకొని - పశ్చాత్తాపముతో ప్రభుని చేరి ఒక చేత ఆయుధము పట్టుకొని - ప్రభుయింటిని కట్టెదమా