పల్లవి:నీ పాద సన్నిధికి - కృపామయ యేసయ్యా (1)నీ ప్రేమ కనుగొనుచు - దేవా నే వచ్చితిని (2)
1. విశ్రాంతి నిచ్చెడు దేవా - శ్రమలెల్ల తీర్చుమయ్యా (2) సిలువయే నా ఆశ్రయము - హాయిగా నచటుండెదను (2)
2. ప్రార్థించుమంటివి ప్రభువా - సంకట సమయములో దయచూపి నను కరుణించి - ప్రేమతో ఆదరించుమయ్యా
3. నరమాత్రుడవు నీవు కావు - మొఱ నాలకించుము మనస్సార ప్రార్థించుచు - యేసు నీదరి చేరెదను
4. నన్ను చేయి విడువకు నాథా - నిందలెన్నో పొందినను నీకై సహించెదనంత - నీ బలము నా కిమ్ము
5. ఆశతో నీ ముఖమును నేను - ఆసక్తితో చూడ సిగ్గుపడనుగా నేను - నీ ప్రకాశము నాపై నుండ
6. శత్రువు నోడించుటకు - నీ శక్తిని చూపు నన్నాదరించి నీవు - ఆవరించి కాపాడుము
7. జీవించి ఎదుగునట్లు - జయ జీవితంబిమ్ము ఫలించి వర్థిల్లుతకై - ప్రభువా నీ కృప నిమ్ము
8. సీయోను మూలరాయి - అయ్యున్న ఓ ప్రభువా కలతను చెందక నేను - నీకై కనిపెట్టెదను