పల్లవి:ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు (1)- దీవెనల వర్షము కుమ్మరించుము (1)ప్రభు కుమ్మరించు ప్రభు కుమ్మరించు (1)
1. ఓమా యేసు విను మామనవి (2) - మా మధ్యకు ప్రభు రారమ్ము (2) నీ ద్వారమున చేరి యున్నాము (2)- నింపుము ప్రభువా మమ్ములను (2)
2. దప్పిగొన్న వారికి జలము - యెండిన భూమికి జలధారల్ నీ సంతతిపై ఆత్మను పంపు - నీ దీవెనలతో నింపుము
3. తండ్రి కుడిప్రక్కన నిలుచున్న - యేసు ప్రభువును చూపుము ఆ మహిమా నివాసములోని - సమృద్ధితో మమ్ము నింపుము
4. రెండు కెరూబుల మధ్య నుండి - మధుర స్వరము విననిమ్ము యేసుని తప్ప యెవరిని వినక - ఆత్మలో తృప్తి పొందెదము
5. తెరువబడిన పరమునుచూడ - దూతలు యెక్కుచు దిగుచుండ నీ సంఘమును అభిషేకించి - ఘనకార్యములను జరిగించు