పల్లవి:యెహోవా ఇల్లు కట్టించని యెడల - దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమేయెహోవా పట్టణమును కాపాడని యెడలదాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే
1. మీరు వేకువనే లేచి రాత్రియైన తర్వాత పండు కొనుచు మీరు - తర్వాత పండు కొనుచు (1) ఆర్జితమైన ఆహారమును (2) మీరు తినుచుండుట - వ్యర్థమే - మీరు తినుచుండుట
2. తన ప్రియులు నిద్రించుచుండగా తానే యిచ్చు చున్నాడు - వారికి - తానేయిచ్చుచున్నాడు తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము కనెడి గర్భఫలము - బహుమానమే - కనెడి గర్భఫలము
3. యౌవన కాలమున పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని - బాణములు - బలవంతుని చేతిలోని తన అంబుల పొదిని నింపుకొనువాడు ధన్యుడు అట్టివాడు - బహుగా - ధన్యుడు అట్టివాడు
4. యెహోవా యందు భయభక్తులు కలిగి నడచు వారందరును - ధన్యులు - నడచు వారందరును మహా మేలు నీకు కలుగును నిశ్చయముగా నీవు - ధన్యుడవు - నిశ్చయముగా నీవు
5. నీవు ధన్యుడవు లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి - వలె నుండు - ఫలించు ద్రాక్షావల్లి భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె - నుందురు -ఒలీవ మొక్కల వలె
6. యెహోవా యందు భయభక్తి గలవాడు ఆశీర్వదింపబడును నిజముగా - ఆశీర్వదింపబడును యెహోవా నిన్ను సీయోను నుండి ఆశీర్వదించును - బహుగా - ఆశీర్వదించును
7. నీ జీవితమంతా యెరూషలేముకు క్షేమము కలుగుటయే - జూతువు - క్షేమము కలుగుటయే నీ పిల్లల పిల్లలను చూతువు నీవు ఇశ్రాయేలు మీద - నిత్యము - సమాధానముండును