పల్లవి:దేవుని ప్రార్థించెదము - దైవ పుత్రుని నామమందు (2)
1. అడుగుడి మీకు నిత్తుననెన్ - వెదకుడి మీకు దొరకుదును (2) మదిని నమ్మి మీరు తట్టినచో (2) ముదమున తలుపు తీయుదుననె (1)
2. గూఢమైన - సంగతులిలన్ గాఢమై - నీవు - గ్రహింపలేని వేడిన పొందెద విలలో దండిగ దాని యేలు పొందెనహా
3. ఇదివరకు మీరేమిలయున్ - నాదు పేరట అడుగ లేదనెన్ మీదు సంతోషము ఇలలో అధికమగును పొందిరి శిష్యులు
4. మనలో కార్య సాధకమైన తనశక్తి - చొప్పున క్రీస్తు చేయున్ మనమడిగినవాటి కంటే ఎంతో ఘనముగా చెరలో పౌలు పేతురు గాంచె
5. ఊహించువా టన్నిటి కంటె - సాహసకార్య ములు ఎన్నో ఊహకు మించె నగ్నిగుండములో ఆహాహా నలుగురు తిరుగుచునుండిరి
6. నా నిమిత్తము జనులు నిన్ను - కాని మాటలెల్ల పలుకునపుడు నిన్ను శపించి హింసించిన కన్నులెత్తి ప్రార్థించి దీవించుమనె
7. నిశ్చయముగా నేను నిన్ను - ఆశీర్వదింతు నని పల్కె నిశ్చయముగ నభివృద్ది జేసి శాశ్వతముగా తోడై యుందు ననే
8. ఎన్ని శోధనలు - వచ్చిన పెన్నుగా - ప్రార్ధించు ప్రభుని కన్నతండ్రి నిన్ను విడువడు సన్నుతించి పాడు హల్లెలూయా