CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 555

ప్రభుయేసు నా రక్షకా నొసగు కన్నులు నాకు

prabhuyesu naa rakshakaa nosagu kannulu naaku

Hebrews 12:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభుయేసు నా రక్షకా - నొసగు కన్నులు నాకు - నిరతము నే నిన్ను జూడ (2)అల్ఫయు నీవే - ఓమేగయు నీవే (2)
1. ప్రియుడైన యోహాను పత్మాసులో - ప్రియమైన యేసూ - నీ స్వరూపము (2) ప్రియమార జూచి - బహు ధన్యుడయ్యె - ప్రియ ప్రభు - నిన్ను జూడనిమ్ము (2)
2. లెక్కలేని మార్లు - పడిపోతిని - దిక్కులేనివాడ - నే నైతిని చక్కజేసి నా - నేత్రాలు దెరచి - గ్రక్కున - నిన్ను జూడనిమ్ము
3. ఎఱిగి ఎఱిగి నే - చెడిపోతిని - యేసు నీ గాయము - రేపితిని మోసపోతి నేను - దృష్టి దొలగితి - దాసుడ నన్ను - జూడనిమ్ము
4. ఎందరేసుని వైపు - చూచెదరో - పొందెదరు వెల్గు - ముఖమున సందియంబు లేక - సంతోషించుచు - ముందుకు - పరుగెత్తెదరు
5. విశ్వాసకర్తా - ఓ యేసు ప్రభూ - కొనసాగించువాడా - యేసు ప్రభూ వినయముతో నేను - నీవైపు జూచుచు - విసుగక - పరుగెత్త నేర్పు
6. కంటికి కనబడని - వెన్నియో - చెవికి వినబడని - వెన్నియో హృదయ గోచరము - కాని వెన్నియో - సిద్ధపరచితివా - నాకై
7. లోక భోగాలపై - నా నేత్రాలు - సోకకుండునట్లు - కృపజూపుము నీ మహిమ దివ్య - స్వరూపమును - నిండార నను - జూడనిమ్ము

Back to Hebron Seeyonu Geethalu