పల్లవి:ఆనందించెదము యెహోవాలో (2) - అతిశయించును మాదు ఆత్మ (2)రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము (2) - నీతి వస్త్రమున్ ధరింప జేసె (2)ఆనందించెదము యెహోవాలో (2)
1. పరదేశులు మమ్ము ప్రభువా దేవా (2) - నీదు యాజక సేవకులనెదరు (1) పరదేశులు మమ్ము ప్రభువా దేవా (2) - నీదు యాజక సేవకులనెదరు (1) జగమున జనముల భాగ్యంబిచ్చి - ప్రభవింతు రంటివి ప్రభావముతో (2)
2. అన్యులు చేసిన అవమానమునకు - ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను అన్యులు చేసిన అవమానమునకు - ప్రతిగా మాకు రెట్టింపు ఘనతను నిందకు ప్రతిగా పొందిన భాగము - అనుభవించుచు హర్షింతు రంటివి
3. వారు తమదు దేశమునందు - రెట్టింపు భాగమునకు కర్తలౌదురు వారు తమదు దేశమునందు - రెట్టింపు భాగమునకు కర్తలౌదురు నిత్యానందము వారికి కలుగును - ఎన్నడు వారిని విడువ నంటివి
4. న్యాయము చేయుట నాకెంతో ప్రీతి - అన్యాయపు సొత్తు నా కసహ్యము న్యాయము చేయుట నాకెంతో ప్రీతి - అన్యాయపు సొత్తు నా కసహ్యము సత్యముబట్టి ప్రతిఫల మిచ్చుచు - నిత్య నిబంధన చేసెదనంటివి
5. జనములకు వారి సంతతి తెలియును - జనముల మధ్యను ప్రసిద్ధి నొందును జనములకు వారి సంతతి తెలియును - జనముల మధ్యను ప్రసిద్ధి నొందును యెహోవా ఆశీర్వదించిన జనమని - ఒప్పుకొందురు చూచినవారు
6. భూమి మొలకను మొలిపించినట్లుగా - తోటలో మొలిచిన విత్తనమువలె భూమి మొలకను మొలిపించినట్లుగా - తోటలో మొలిచిన విత్తనమువలె జనముల యెదుట ప్రభు యెహోవా - నీతిస్తోత్రములను ఉజ్జీవింపజేయును
7. క్రీస్తునందు మాకిచ్చినయట్టి - ఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకై క్రీస్తునందు మాకిచ్చినయట్టి - ఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకై సర్వోన్నతుడా సన్నుతించుచు - హల్లెలూయ స్తోత్రముల్ ఆరోపింతుము