CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 524

యేసూ ఆత్మ ప్రియుడా నిన్ను నాశ్రయించితి

yesoo aatma priyudaa ninnu naashrayinchiti

Psalms 27:9

More
Reference recording on YouTube ↗
1. యేసూ, ఆత్మ ప్రియుడా - నిన్ను నాశ్రయించితి లేవగా దరంగముల్ - గాలివాన కొట్టగా జీవ బాధలన్నిటన్ - నన్ను దాచు రక్షకా నన్ను నడ్పి రేవునన్ - ఆత్మ జేర్చుమీ తుదన్
2. దిక్కులేని యాత్మకు - వేరే ప్రాపు లేదిక నొంటిగాను విడ్వక - నన్ను యాదరించుమీ నిన్నే నమ్మియుంటిని - నీవే నా సహాయము కాపులేని నా తలన్ - నీదు రెక్క క్రమ్మనీ
3. క్రీస్తు నిన్ను గోరుదున్ - దొర్కునన్ని నీకడన్ పడ్డహీను నెత్తుమీ - స్వస్థపర్చు రోగులన్ న్యాయ శుద్ధ నామము - నీదే నేను పాపిని నేను పాపపూర్ణుడన్ - నీవు ప్రేమరూపివి
4. పాపమెల్ల మాన్పగా - నీదు ప్రేమ చాలును మాన్పు నీళ్ళు నా యెదన్ - శుద్ధిచేయగా నిమ్ము నీవు జీవపూటవు - త్రాగనిమ్ము నీదరిన్ పుట్టి నాదు నాత్మలో - నెల్ల వేళ పారుమీ

Back to Hebron Seeyonu Geethalu