CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 517

నాయాత్మ లంగరువేయ సుస్థిర భూమి చిక్కెను

naayaatma langaruveya susthira bhoomi chikkenu

Psalms 40:2

More
1. నాయాత్మ లంగరువేయ - సుస్థిర భూమి చిక్కెను నా పాపము హరించెడు - నిత్యుండౌ యేసుగాయముల్ కల్పాంతకాలమైనను - సదా యీ ప్రేమనిల్చును
2. తండ్రీ! నీ ప్రేమ నిత్యమై - మాయల్ప బుద్ధిని మించు నీ యుల్లమందు సర్వదా - కారుణ్యముండినందున మరలివచ్చు పాపులన్ - జేర్చి జీవింప జేతువు
3. నీ ప్రేమ లోతుతేలదు - మేమెన్న శక్యముగాదు నా పాపమంత దాచితి - నిర్దోషిగా నన్నెంచితి శ్రీయేసు పుణ్యముండగా - ధారాళ కృపనిత్తువు
4. నా కష్టముల్ తుఫానుగా - నా తలపైన క్రమ్మిన లోకేచ్ఛలన్ని భంగమై - యసౌఖ్యముల్ ప్రాప్తించిన నీ ప్రేమ నిత్యము కాగా - నదే నాయాత్మలంగరు
5. హృదయ భీతియుండిన - ప్రపంచము లయించిన నీ వన్ని కదిలింపుము - నాలంగర్ స్థిరమై యుండి ననంత ప్రేమ శక్తిని అనుభవింతు

Back to Hebron Seeyonu Geethalu