పల్లవి:ఆకాశమా! ఆలకించుమా - మాటలాడెదన్...2యెహోవా వంతు ఆయన జనమేగదా యాకోబే స్వాస్థ్యభాగము...2
1. అరణ్య ప్రదేశంబుల యందున (2) భీ - క -ర -ధ్వనిగల యెడారిలో వాని కనుగొనెను (2) ఆవరించి వాని పరామర్శించి గాచె కనుపాపగా (2)
2. యెహోవాయే వాని నడిపించెను భూ - మి -యొక్క ఉన్నతస్థలముల మీద వాని నెక్కించి అన్య దేవతలతో నేదైనను లేకపోయె వానిలో
3. లేచి వెళ్ళుమనే బేతేలునకు దే - వు - నికి బలిపీఠమచ్చట కట్టుమని సెలవియ్యగా అన్యదేవతల పారవేయుమని తనవారితో చెప్పెన్
4. తిరిగి బేతేలులో దర్శన మిచ్చెను దీ - వించి నీ పేరు ఇశ్రాయేలుగా నెల్లప్పుడుండుననెను తన యింటికి వచ్చువారి నెల్ల ప్రభుదీవించు నీరీతిన్
5. ప్రభుని రాకడ సమీపమంచును స - మా - జముగా కూడుట మరువక మరియు మీరు మానక ప్రభుని యింటి దీవెన లెల్ల పొందుడి నిక్కముగా