CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 501

మీరే లోకమునకు వెలుగు

meere lokamunaku velugu

Matthew 5:13-16

More
Reference recording on YouTube ↗
పల్లవి:మీరే (2) లోకమునకు వెలుగు - లోకమునకు ఉప్పు మీరే (1)
1. మనుజులు మీదు మంచి క్రియలను - కని తండ్రిని మహిమ పరచగ (2) వినయమున మీ వెలుగు వారికి - కనబడగా ప్రకాశించుడి (2)
2. కొండమీద నుండు పట్టణము - ఉండనేరదు మరుగైనిజముగ దండిగ మనదు తండ్రి స్వరూపము - ఉండగ మీలో ప్రకాశించుడి
3. దేవుని వాక్యము వెలుగై యున్నది - జీవించుడి వెలుగును కలిగి పావనమగు సహవాసము కలిగి - దేవుని ఆత్మలో నిండి వర్థిల్లెడు
4. మరణచ్చాయలో మీరుండగ - పరమ వెలుగు ప్రకాశించెను పరిగిడె చీకటి వెలుగుదయించగ - పరిశుద్దాత్మ ఫలములు పొందిన
5. మీరికమీదట పరదేశులును - పరజనులుగ నుండక యుందురు పరిశుద్దులతో నేకపౌరులై - దేవుని గృహమునై యున్న
6. రాత్రి పగలు భేదము లేక - చంద్రుని సూర్యుని కాంతియు లేక ప్రభువగు దేవుడు ప్రకాశించును - యుగయుగముల కాయన రాజ్యము
7. ప్రభువగు దేవుడే జీవమై యుండియు - ఉప్పుగా జేసెను మిమ్మును తనకై ఉప్పును బోలి సారము కలిగి - ప్రభుయేసునకే హల్లెల్లూయ పాడుడి

Back to Hebron Seeyonu Geethalu