పల్లవి:యెహోవా నా బలమా - యధార్థమైనది నీ మార్గంపరిపూర్ణమైనది నీ మార్గం - యెహావా
1. నా శత్రువులు నను చుట్టినను - నరకపు పాశముల రికట్టినను (2) వరదవలె భక్తిహీనులు పొర్లిన - విడువక నను యెడబాయని దేవా (2)
2. మరణపుటురులలో మరువక మొరలిడ - ఉన్నత దుర్గమై రక్షణశృంగమై తన ఆలయములో నా మొర వినెను - అదిరెను ధరణి భయకంపముచే
3. పౌరుషముగల ప్రభు కోపింపగా - పర్వతముల పునాదులు వణికెను తననోటనుండి వచ్చిన యగ్ని - దహించి వేసెను వైరులనెల్ల
4. మేఘములపై ఆయన వచ్చును - మేఘములను తన మాటుగ జేయును ఉరుముల మెరుపుల మెండుగ జేసి - అపజయ మిచ్చును అపవాదికిని
5. దయగల వారిపై దయ చూపించును - కఠినుల యెడల వికటము జూపును గర్విష్టుల యొక్క గర్వము నణచును - సర్వము నెరిగిన సర్వాధికారి
6. నా దీపమును వెలిగించు వాడు - నా చీకటిని వెలుగుగా జేయును జలరాసుల నుండి బలమైన చేతితో - వెలుపల జేర్చిన బలమైన దేవుడు
7. నా కాళ్ళను లేడి కాళ్ళగా జేసి - ఎత్తయిన స్థలముల శక్తితో నిలిపి రక్షణ కేడెము నా కందించి - అక్షయముగ తన పక్షము జేర్చిన
8. యెహోవా జీ...వము గల దేవా - బహుగా స్తుతులకు అర్హుడ వీవు అన్యజనులలో ధన్యత జూపుచు - హల్లెలూయ స్తుతిగానము జేసెద