CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 499

ఎరిగియుంటివే యెహోవా

erigiyuntive yehovaa

Romans 8:29-30

More
Reference recording on YouTube ↗
1. ఎరిగియుంటివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - ఎరిగియుంటివే (1) భూమి పునాదులు వేయకముందే (2) - ఆకాశము సహా లేకున్నపుడే (1) ఇలపర్వతములు నిలవకముందే (1)- కనబడు ప్రతిదియు లేకున్నపుడే (2) ఎరిగియుంటివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - ఎరిగియుంటివే (1)
2. నిర్ణయించితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నిర్ణయించితివే పరమున కూటము జరుగకముందే - రక్షణ వెలుగుకు రాకున్నపుడే ప్రాయశ్చిత్తపు బలికాకున్నపుడే - యేసు రూపమిల్ నేర్పడనపుడే నిర్ణయించితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నిర్ణయించితివే
3. పేరున పిల్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - పేరున పిల్చితివే చేత ఆదామును చేయకముందే - హానోకు నీతో నడువకముందే నోవాహును రక్షింపకముందే - పిత్రుడబ్రామును పిలువకముందే పేరున పిల్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - పేరున పిల్చితివే
4. నీతిగ తీర్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నీతిగ తీర్చితివే గర్భములో నే కలుగకముందే - కాలపరిమితి కాకున్నపుడే కటిక చీకటి కాకున్నపుడే - నిర్దేవుడనై నేనుండగనే నీతిగా తీర్చితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - నీతిగ తీర్చితివే
5. మహిమ పరచితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - మహిమ పరచితివే తేజోమయముగ దివిరాజ్యమున - దూత గణంబులు ప్రీతిగ పొగడ తరుగని నిత్యతండ్రి మహిమతో - మహిమ రూపుడగు మరియ సుతునితో మహిమ పరచితివే - యెహోవా - యేసుక్రీస్తునందు నన్ను - మహిమ పరచితివే

Back to Hebron Seeyonu Geethalu