పల్లవి:దేవుడు మీకు ఎల్లప్పుడు -దేవుడు మీకు ఎల్లప్పుడు - తోడుగనున్నాడు ... (3)
1. ఏదేనులో ఆదాముతో నుండెన్ (2) - హానోకు తోడనేను (2) దీర్ఘ దర్శకులతో నుండెన్ (2) - ధన్యులు దేవుని గలవారు (2) తోడుగనున్నాడు (1)
2. దైవాజ్ఞను శిరసావాహించి (2) - దివ్యముగ నా బ్రాహాము కన్న కొమరుని ఖండించుటకు - ఖడ్గము నెత్తిన యపుడు తోడుగనున్నాడు
3. యోసేపు ద్వేశించ బడినపుడు (2) - గోతిలో త్రోయబడినపుడు శోధనలో చెఱసాలయందు - సింహాసన మెక్కినయపుడు తోడుగనున్నాడు
4. ఎర్ర సముద్రపు తీరమునందు ఫరోతరిమిన దినమందు యోర్దాను దాటినదినమందు - యెరికో కూలిన దినమందు తోడుగనున్నాడు
5. దావీదు సింహము నెదిరించి (2) - ధైర్యాన చీల్చినయపుడు గొల్యాతును హతమార్చినయపుడు - సౌలుచే తరుమబడినపుడు తోడుగనున్నాడు
6. సింహపు బోనులో దానియేలు - షద్రకు మేషా కబేద్నెగో అగ్ని గుండములో వేబడెన్ నల్గురిగా కనబడినపుడు తోడుగనున్నాడు
7. పౌలు బంధించబడినపుడు పేతురు చెరలో నున్నప్పుడు అపోస్తలులు విశ్వాసులు (2) - హింసించ బడినయపుడు తోడుగనున్నాడు