పల్లవి:స్వచ్ఛంద సీయోనువాసి - సర్వాధికారి - కస్తూరి పూరాసి ఆ .. ఆ .. (2)
అను పల్లవి:వర్తమాన భూతభవి - ష్యత్కాలవాసి (2)అల్ఫా ఓమేగ తానే - ఆద్యంతము మన యేసే (2) || స్వ ||
1. ఇదిగో నేనొక నిబంధనను - అద్భుతముల జేతున్ నీ ప్రజలందరి యెదుట (2) పరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువే (2) లెక్కలేని యద్భుతముల్ - మక్కువతో చేయువాడు (2)
2. సంగీత నాదములతోడ - సీయోనుపురము సొంపుగను చేరితిమి శాశ్వత సంతోషము మా - శిరములపై వెలసెన్ దుఃఖము నిట్టూర్పును పోయెన్ - మిక్కిలి ఆనందముగల్గెన్
3. నీలముల పునాదులు వేసి - నీలాంజనములతో - మాణిక్య మణులతో సువర్ణ శునీయముల - సూర్యకాంతముతో ప్రశస్త రత్నములతో - ప్రవిమలముగ నినుగట్టెదను
4. సుమముల హారము - సంతోషానంద తైలము నీదే - స్తుతి వస్త్రమును నీదే ఉల్లాసవస్త్రంబు నీదే - విడుదలయు నీదే హితవత్సరము విముక్తి - ఆత్మాభిషేకము నీదే
5. జలములలోబడి దాటునప్పుడు - బలమై యుండెదను - నీతోడై యుండెదను నదులలో వెళ్ళునప్పుడు - నీపై పారవు అగ్ని మధ్యను నడచినను - జ్వాలలు నిను కాల్చగలేవు
6. ఇత్తడి తలుపుల బగుల గొట్టెద - నినుప గడియలను - విడగొట్టెదను నేను అంధకారస్థలములలో ను-న్నట్టి నిధులను రహస్యములో మరుగైన - ధనమును నీ కొసంగెదను
7. గర్భమున పుట్టినది మొదలు - తల్లి యొడిలోన - కూర్చుండినది మొదలు నేను చంక బెట్టుకొన్న - నాదు ప్రజలారా ముదిమి వచ్చువరకు నిన్ను - ఎత్తుకొను వాడను నేనే