CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 49

వారాయనను జన సమాజములో ఘనపరచుదురు గాక

vaaraayananu jana samaajamulo ghanaparachuduru gaaka

Psalms 107:32-43

More
Reference recording on YouTube ↗
పల్లవి:వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక (1)వారాయనను పెద్దల సమాజములో కీర్తింతురు గాక (1)
1. దేశనివాసుల చెడుగును బట్టి - నదుల నడవిగ జేసెను (2) నీటి బుగ్గల నెండిన - నేలగాను మార్చెను (2)
2. అడవిని నీటిమడుగుగా - మార్చివేసె నెహోవా ఎండిన నేలను నీటి - ఊటగాను మార్చెను
3. పురములు నివాసమునకై - వారేర్పరచుకొనునట్లు పొలములలో విత్తనములు చల్లి - ద్రాక్షాతోటలు నాటిరి
4. సస్య ఫల సమృద్ధి పొందు - నట్లు వాటివలన ఆయన ఆకలిగొనిన వారిని - అచ్చట కాపురముంచెను
5. మరియు ఆయన వాని నధికము - గా నాశీర్వదించగా వారి సంతానాభివృద్ధి - అధికముగా వర్ధిల్లెను
6. వారు విచార బాధ వలన - తగ్గిపోయినపుడు రాజులను తృణీకరించి - ఎడారిలో తిరుగజేసె
7. అట్టి దరిద్రుల బాధను బాపి - వారిని లేవనెత్తెను అట్టివారి వంశము మంద - వలె వృద్ధిచేసెను
8. యధార్థవంతులు దాని - చూచి సంతోషింతురు మోసము చేయువారందరు - మౌనముగా నుందురు
9. బుద్ధిమంతులు యీ విషయ-ముల నాలోచించును యెహోవ కృపాతిశయముల - దలంచెదరు గాక

Back to Hebron Seeyonu Geethalu