పల్లవి:సీయోను పాటలు సంతోషముగ - పాడుచు సీయోను వెళ్లుదము (2)
1. లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు (2) పొందవలె నీలోకమునందు - కొంత కాలమెన్నో శ్రమలు (2)
2. ఐగుప్తును విడచినట్టి మీరు - అరణ్య వాసులే యీ ధరలో నిత్యనివాసము లేదిలలోన - నేత్రాలు కానాను పై నిలుపుడి
3. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్ననేమి నీరక్షకుండగు యేసే నడుపును - మారనితనదు మాటనమ్ము
4. ఐగుప్తు ఆశల నన్నియు విడిచి - రంగుగ యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబుమాని - విధేయులై విరాజిల్లుడి
5. ఆనందమయ పరలోకము మనది - అక్కడ నుండి వచ్చునేసు సీయోను గీతము సొంపుగ కలసి - పాడెదము ప్రభుయేసుకు జై