పల్లవి:ఇదిగో మీ దేవుడని - యూదా పట్టణములకు - ప్రకటించుడిప్రభువగు మన యేసు తానే - శక్తి సంపన్నుడై త్వరగా వచ్చును
అను పల్లవి:బలముగా ప్రకటించుడి - భయపడక ప్రకటించుడి (2)
1. ప్రేమగా మాట్లాడుడి - యెరూషలేముతో నా జనులను - ఓదార్చుడి ఆమె దోషరుణము తీర్చబడెనని రెండింతలు ప్రతిఫలము - పొందెనని
2. సర్వ శరీరులు - గడ్డివంటివారే అడవి పువ్వు వంటిదే వారి అందము గడ్డియెండి దాని పువ్వుము - వాడిపోవును మన దేవుని వాక్యము - నిత్యము నిలుచునని
3. మన దేవుని మార్గమును సిద్ధపరచుడ సరాళము చేయుడి రాజమార్గము మన యేసు మహిమతో బయలుపడును సర్వ శరీరులు దాని చూచెదరు
4. శ్రమననుభవించుడి - మంచి సైనికులై చిక్కుకొనకుడి - జీవన వ్యాపారములలో నియమ ప్రకారము - పోరాడుడి కిరీటము పొంది - యేలుటకై
5. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో ప్రీతికరమైన సేవ - చేయుదము దేవునికే మహిమ - యుగ యుగములకు
6. సువార్తను ప్రకటించు ఓ సీయోను ఉన్నత పర్వతమును ఎక్కుము సువార్తను ప్రకటించు యెరూషలేమా నీ యుద్ధకాలము సమాప్తమాయెను
7. ఉపదేశించుము సరిగా సత్యవాక్యము యోగ్యునిగా సిగ్గుపడని పనివానిగా బహుమానముతో వచ్చును యజమానుడు అవిధేయత చూపకు దర్శనమునకు