CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 481

నీ స్వరము వినిపించు ప్రభువా

nee svaramu vinipinchu prabhuvaa

1 Samuel 3:9

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీ స్వరము వినిపించు ప్రభువా - నీ దాసుడాలకించున్నీ వాక్యమును నేర్పించు - దాని యందు నడచునట్లు నీతో
1. ఉదయమునే లేచి నీ స్వరము వినుట - నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నను సిద్ధపరచు - రక్షించు ఆపదల నుండి
2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు - నేను సరిచేసికొందు నీ మార్గములో నడచునట్లుగా - నేర్పించుము ఎల్లప్పుడు
3. భయ భీతులలో తుఫానులలో - నీ స్వరము వినిపించుము అభయము నిమ్ము ఓ గొప్ప దేవా - ధైర్యపరచుము నన్ను
4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా - నీ స్వరము నా కొరకే నీతో మనుష్యులతో సరిచేసికొందు - నీ దివ్య వాక్యము ద్వారా
5. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది - అది రెండంచులుగల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుత అద్దం - నిజ స్వరూపమును చూపించున్
6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా - నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో - నీ యందు నిలచునట్లుగా
7. నా హృదయములోని చెడు తలంపులను - ఛేదించు నీ వాక్యము నీ రూపమునకు మార్చుము నన్ను - నీదు మహిమ కొరకేగా

Back to Hebron Seeyonu Geethalu