పల్లవి:సమస్త జనులారా మీరు - యెహోవాకు స్తుతిగీతము పాడి (1)సంతోషముతో సన్నిధిలో - ఉత్సాహించుడి జయమనుచు (2)
1. తానె యొనర్చె మహకార్యములన్ - పాపిని రక్షింప బలియాయెన్ (2) శత్రుని రాజ్యము కూలద్రోసెను స్మరియించుడి మీరందరును (2) ఆయనను స్తుతియించుడి (1)
2. జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు - విడిపించె నైగుప్తునుండి నలువది వత్సరములు నడిపించె - కానానుకు మిమ్ము చేర్చుటకు ఆయనను స్తుతియించుడి
3. మోషేకు తన సేవను నొసగె - యెహోషువా జయమును పొందె శత్రుని గెల్చి రాజ్యము పొందె ఘనకార్యములను స్మరియించి ఆయనను స్తుతియించుడి
4. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా - కొనె మిమ్ము తన రక్తముతో ఆత్మల చేర్చి సంఘము కట్టె ఆ రీతిని కని స్మరియించు ఆయనను స్తుతియించుడి
5. పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము - నేడే వినుమాయన స్వరము అర్పించుడి మీ జీవితములను - సాగిలపడి ఆయన యెదుట ఆయనను స్తుతియించుడి