పల్లవి:పరిశుద్ధ మందిరము నాకు (2) - నిర్మించ మంటిరి ప్రభువా (2)ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచ మంటిరి ప్రభువా (2)
1. తుమ్మ కర్రతో మందసమును (2)- జేసి బంగారును - పొదిగించిన (2) తుమ్మకర్ర మీరేయని యంటిరి (2)
2. కరుణాపీఠము కావెలెనంటిరి - కరుణాపీఠము నేనే యనుచు ప్రాణమిడితిరి కరుణను జూపి
3. బలిపీఠమును చేయుమంటిరి - బలిపీఠము నా సిలువయే యనుచు బలియైతిరి మీ రక్తము కార్చి (2)
4. ఆవరణ ద్వారంబుల జేసి - ముగించితిని మీ పనినంతటిని మహిమయు ఘనత మీకే కల్గున్
5. నావన్నియును మీకిచ్చితిని - మీ వన్నియును నావే ప్రభువా కృప జూపితిరి మీ మహాప్రేమన్
6. పరిశుద్ధ పట్టణమునందు - నివాస స్థలము నా కొసగితిరి తరతరములు మీతో నివసింతున్