CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 442

ప్రభుయేసు సంఘము నిర్మించుచుండ

prabhuyesu sanghamu nirminchuchunda

Matthew 16:18

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభుయేసు సంఘము నిర్మించుచుండ (2)గర్విసాతాను జయమొంద లేడు (2)
1. పరలోకమాదిరి నిర్మించుచుండె (2) - నరుని ఆలోచన జరిగింప డిందు (2) స్థిరపునాదిపై నిర్మించుచుండె (2) - పరిపూర్ణతను విరివిగా నింపున్ (1)
2. ఆదాముతో కూడ నడిచిన దేవుడు - గుడారమున వసియించినాడు సొలొమోనాలయము నింపినాడు - కాలమెల్ల తనయునిలో వసించున్
3. క్రీస్తు ప్రభు దాని స్థిరపునాది - ఇసుక పై వేసిన నశియించునంత సజీవుడగు యేసు నిజ మూలరాయి - సజీవరాళ్ళను విజయుడు జేర్చున్
4. నిత్య దేవుని నిజ ఆత్మజులారా - ఆత్మీయంబగు ఆలయము మీరే ఆత్మ ఐక్యమును అనుసరించుడి - హస్తకృతంబులు ఆలయమగునా?
5. యూదుడని మరి హెల్లేనీయుడని - లేదు జాతుల భేదము లేమి లేదు దాసుడు స్వతంత్రుడని - భేదముండదు స్త్రీ పురుషులని
6. ఏ నామమున లేనిది సంఘము - నామమిచ్చిన యెన్నదగు కీడు కనబడు కట్టడములు కలిపి పోల్తుమా - కనివిడిచెదము పొరబాటులను
7. ప్రకటించెదము ప్రాకటముగను - ఏక మనస్సుతో ఏక శరీరమని సకల కాలము శక్తితో నిలిచి - పొగడుచు శిరస్సును పాడెద మిపుడె

Back to Hebron Seeyonu Geethalu