1. సీయోనుపట్టణమా - సువర్ణ నగరమా (2) మహిమాపురమా - మహా భాగ్యము నీదే (2) రమ్యమైనట్టిరా - రాజుపురమా (2)
2. సీయోను సుందరులు - సువర్ణ సములు వన్నెపగడాల ఛాయ - కన్న గొప్పది కాంతి నీలములకన్న - మంచిది (2)
3. ప్రభువే నిన్ను కోరి - ప్రేమించినాడు సర్వోన్నతుడే నిన్ను - స్థిరము జేసెను (2) నిత్యనివాసముగ - నిను జేసెను (2)
4. తన చంటిపిల్లను - తల్లి మరచునా మరచినగాని నేను - మరువను నిన్ను చెక్కితిని నిను నా యర - చేతుల మీద
5. భయమేల సీయోను - బలమొందిలెమ్ము సంతసమున పాట సాహాసమున పాడుడీ వసియించు నీ ప్రభువు - వచ్చి నీలో
6. పెండ్లి కుమారుడు - పెండ్లి కూతురును చూచునట్లు నిన్ను - చూచి దేవుడు సీయోను నీయందు - సంతస మొందున్
7. సీయోను పగవారు - సిగ్గునొందెదరు నిన్ను భాదించినట్టి - నీ పగవారు పరుగున నీ పాదముల - పై బడెదరు
8. సీయోను నీ నీతి - సూర్య కాంతివలె రయమున యేసు నీదు - రక్షణజ్యోతి వెలిగించువరకు - విశ్రమించడు