CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 409

కృపకాలములో ప్రభుయేసుని

krupakaalamulo prabhuyesuni

2 Cor 6:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:కృపకాలములో - ప్రభుయేసుని - అంగీకరించుము ఓ ప్రియుడా (2)కృపకాలములో (1)
1. సర్వలోకము సంపాదించి - నీ ఆత్మను కోల్పోయిన (2) మిత్రుడా నీ కేమి లాభముండును (2) ఈ లాటి జీవముతో (1) యేసుని ప్రేమ స్వరము విని - తెరువు నీ హృదయము (1) ప్రభు యేసుని చరణముల్ చేరి అనంత ముక్తి పొందు (2)
2. ధర్మ కర్మ సంస్కారమువలన - పరిశుద్ధుడవు కానేరవు భక్తి వేషాలు ధరించుకొన్న - పరలోకము చేరవు కాగా మిత్రుడా నీ పాపములను - ఒప్పుకొను యేసు నొద్ద మహాప్రభుని చరణముల్ చేరి - అర్పించుకో నిన్నే
3. ప్రభుయేసుక్రీస్తు నిత్యరక్షణకు - ఏకైక మార్గం గ్రహించుకో పాపమార్గం వదలి పశ్చాత్తాపముతో - ప్రభుశరణము చేరి నీ పాపములను ప్రభురక్తమందు - కడిగి శుద్ధిచేసుకో పరలోక ఆశీర్వాదములు నిత్య జీవము పొందు
4. క్రీస్తులో పూర్ణ నిత్యజీవం - పరలోక ఆశీర్వాదములు ఓ మరణమా నీ ముల్లెక్కడ - క్రీస్తునందు విజయమే శిక్ష దండన తొలగింపబడె - ప్రభుయేసు క్రీస్తునందే ప్రభు శక్తిచే పాతాళ ద్వారం - సదా ఓడింపబడె

Back to Hebron Seeyonu Geethalu