CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 401

యేసు నిన్ను పిలచెను వాసిగా స్వరము విను

yesu ninnu pilachenu vaasigaa svaramu vinu

John 11:28

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసు నిన్ను పిలచెను - వాసిగా స్వరము విను (2)
1. కార్చె రక్తము కల్వరిలో - కఠిన బాధలెల్ల నోర్చి (2) చూపె ప్రేమ నుర్వికొఱకు - జాపె బాహువుల్ కరుణతోడ - చేర దీయును (1)
2. క్రీస్తు ప్రేమ తెలిసికొనుము - రయము తోడ మనసు నిల్పి దాని పొడవు వెడల్పు లోతు - నెత్తు గ్రహించు తెలివి తోడ చెంత చేరుము
3. ప్రీతి తోడ యేసు ప్రభువు - ప్రాణము నర్పించె నీకై దీని వలన ప్రేమ యెట్టిదో - తెలిసికొనుము బుద్ధితోడ పాప మొప్పుకో
4. బల్లెముతో పోటుపొడువ - బాధ సహించె ప్రేమ తోడ సమాప్తమని తలను వంచె - సర్వలోక సృష్టికర్త చాటు జేరుము
5. లోకమంత జయించుకొన్న - లోభివలె నశించెదవుగా స్వంత ప్రాణమును కాపాడు - స్వరక్షకుని చెంత జేరి సేద దీర్చుకో

Back to Hebron Seeyonu Geethalu