పల్లవి:యేసుని స్వీకరించు - క్రీస్తేసుని స్వీకరించు (1)నీ హృదయపు ద్వారము తెరువుము -త్వరితము తానే ప్రవేశించును (2)
1. కనికరమందైశ్వరుండు - నిను - వాత్సల్యముతో విమోచించును (2) భయంకరమైన పాపమునుండి - విడిపింప నిన్ను వెదకివచ్చెన్ (1)
2. మన్నించు సర్వ పాపములన్ - తానే - మాన్పును సర్వరోగములన్ కృప కనికరముల మకుటము నీకు - ధరియింప జేసి ఘనపరచున్
3. అంధులకు దృష్టి కలుగజేసె - అంగ - హీనులను లేపి నడువజేసెన్ పలు విధములగు వ్యాధి గ్రస్తులకు - స్వస్థత నిచ్చెను తక్షణమే
4. పాపపు భారము భరియించెను - నీ - రోగములన్నిటి తొలగించన్ సహించెను కొరడా దెబ్బల బాధను - జయించెను అన్ని శోధనలన్
5. కలువరి సిలువలో ప్రేలాడి - తన - రక్తము చిందించె ధారలుగ చేతులలో తన కాళ్ళలో చీలలు - ముండ్ల కిరీటము ధరియించె
6. జీవమిచ్చుటకు ప్రాణమిడె - మరి - జయించెను ప్రతివిధ శోధనలు నీ కొరకై మరణించి లేచెను - శక్తిమంతుడే నిను రక్షింప