CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 396

చూడుము సోదరుడా నీవు

choodumu sodarudaa neevu

John 1:4

More
Reference recording on YouTube ↗
పల్లవి:చూడుము సోదరుడా నీవు - నేడే లేచి రక్షణ కొరకై - వేడుము స్నేహితుడా (2)
1. లెమ్ము నీకు వెలుగువచ్చెను - కమ్ముచున్నది చీకటి లోకమున్ (2) చిమ్మచీకటి జనముల గమ్మెను - నెమ్మది నొందగ లేచి రా (2) నమ్ముము సోదరుడా (1)
2. దేవుని వాక్యము వెలుగైయున్నది - ఆ వెలుగే నీకు జీవమైయున్నది నీ వెనుకే ఆ జీవము నిలచెను - జీవము నొందగ వేగమే రా రావో సోదరుడా
3. నిలువుము నీ జీవము ఆవిరియే - ఇలలో లేదిక నీదని చెప్పెడు కలుషము లెల్లను కడుగును క్రీస్తు నిలుచును ఇల నీ కాపరియై కలువరి చెంతకు రా
4. మొర్రపెట్టుము నేడే లేచి - సరిచేసికొని జీవితమంత పరిశుద్ధ రక్తధారలతో - పరిశుద్ధుడు నిలచెను నీకై పరుగిడిరా ప్రియుడా
5. యేసుని నమ్మెడి వారిలలోన - యేసుని జీవము పొందిన వారై భాసురంబుగా మోక్షము జేర - నిల్చెదరు శక్తిని బొంది యేసే ఒసగును రా
6. హల్లెలూయ పాడుము నేడే - వల్లభుండేసు వచ్చునని ఎల్ల ప్రజలు చూచెద రేసున్ - చల్లని ప్రభూరాకన్ ఇలలో స్తుతులను పాడను రా

Back to Hebron Seeyonu Geethalu