CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 394

యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును

yesu prabhuve neeku rakshana nichunu

Hebrews 2:4

More
Reference recording on YouTube ↗
పల్లవి : యేసు ప్రభువే - నీకు రక్షణ నిచ్చును (2)ఇంత గొప్ప - రక్షణ నిర్లక్ష్య పెట్టకు (2)
1. మృతియే పాపపు జీవము - ప్రభుని వరము జీవము (2)క్రీస్తు నంగీకరించిన - నిత్యజీవ మిచ్చును (2)ప్రాణమున్ ఆ సిలువపై ని - బలిగా నిడి నిన్ కొనెగదా (2)మరతువా యేసుని ప్రేమను - మరువకు (2)
2. కంటికి కనబడని వెన్నో - చెవికి వనబడనివెన్నోగ్రహింప శక్యము కానివి - నీకై సిద్దపడెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదాపెడచెవిన్ పెట్టకు యేసుని మాటను
3. మరణ బలము గలవానిన్ - నాశనంబు చేసెన్మరణ భయములో నున్న - వారిని విడిపించెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదాహృదయమున్ తెరువుము యేసును చేర్చుకో
4. సిలువ రక్తము చేతను - నిర్దేవులైన వారినిమధ్యపు గోడను పడగొట్టి - ఐక్యపరచే దేవునితోప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదాసమాధానపడు మిక దేవునితో - యీక్షణమే
5. దైవస్వభావంబులో - పరిశుద్ధాత్ముని యందుపరలోకపు పిలుపులో - పాలివారల జేసెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదాపరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిభాగ - మొందుము
6. దేవుని పరిశుద్ధతలో - కలుగబోవు మహిమలోక్రీస్తుయేసు ప్రభువులో - పాలివారల జేసెనుప్రాణమున్ ఆ సిలువపైని - బలిగా నిడి నిన్ కొనెగదాత్వరపడు నీదు భాగమును పొందను
7. పరలోకములో కనబడు - తెల్లనైన వస్త్రముల్ధరించుకొను సమూహము - ఖర్జూర మట్టలు చేబూనిదేవునికిని గొఱ్ఱెపిల్లకును - స్తోత్రములు చేయుచుండనీవు నీ రక్షణకై పాడువు - హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu