1. మాయలోక మాయలో నేల మున్గి తిరిగెదవు (1) కాయము నిన్ను మోసముచేయు కాలమాయెను (1)
పల్లవి:మరణము వచ్చున్ మరణము వచ్చున్ (1)లోకము ముగియున్ (1) - మానవులపై కృపకాలము - దాటిపోవును (1)
2. పాతాళము నిన్ను మ్రింగ కాచి నిల్చెను ప్రాణనాథుడేసు నిన్నురక్షింప వచ్చెను ||మరణ||
3. వేదవాక్యము మారక పూర్తియగును దేవకోపము మానవులకై పోయబడును ||మరణ|
4. లోకము దిగుల్ కలహములతో తత్తరిల్లును మేఘమందు యేసు రాజు కానిపించును ||మరణ||
5. యేసు నేనే మార్గం సత్యం జీవము నేనే మోసపోకు డెందు మార్గం వేరే లేదనెన్ ||మరణ||
6. పాపికై మరణించిన యేసు కాచి నిల్చెను పాపి! నిన్ను పిల్చుచున్నాడు చెంత జేరుమా ||మరణ|