పల్లవి:యేసు నామమునే పాపికి రక్షణ - సర్వజగము నందు (2)
అను పల్లవి:ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు (2)
1. ఈ జగతికే తెంచి రక్తము కార్చి - బలిగా నర్పించుకొనెన్ (2) మనల రక్షింప సంతోషమివ్వ - సిలువలో బలి ఆయెన్ (2)
2. పాపము నుండి శాపము నుండి - మనలను విడిపింప దేవాది దేవుడు మానవ రూపము - దాల్చియిలకు వచ్చెన్
3. పాపుల కొరకై రక్తము కార్చి - సిలువలో మరణించెన్ మరణము జయించి సమాధిని గెలచి - విజయుండాయె యేసే
4. పాపము ఉండదు - భయము ఉండదు యేసయ్య రాజ్యములో ఈ ప్రభువే మనతో నుండునుగా - పరలోక రాజ్యములో