పల్లవి:యేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ - సత్యదేవుని వాక్యమిదే (1)ఆయన రాకడ అంత్య గుర్తులు - అన్నియు నెరవేరుచున్నవియేసు శీఘ్రముగ తిరిగివచ్చున్ (1)
1. పాపదుఃఖములు పెరుగుచున్నవి - యుద్దకలహములు వృద్ధియాయెను (2) జనముపై జనము లేచుచున్నది - రాజ్యముపై రాజ్యము లేచుచున్నది (2)
2. భూకంపములు భువిని జరుగుచుండె - లోకమున తెగులు కరువు లున్నవి ఆకసమున భయసూచనలు - వీక్షింతురు వింత సూచనలు
3. విశ్వాసులు పైకి ఎత్తబడన్ - యేసు పరమునుండి దిగివచ్చును యేసుతో వెయ్యేండ్లు ఏలెదురు - ఆశతో కనిపెట్టుకొనువారలు
4. మారుమనస్సు నొందుమీ క్షణమే - కోరు యేసు రక్తాన కడుగుమని ఈ రోజున నీవు సిద్ధపడుము - పరలోకమున ప్రవేశింతువు