పల్లవి:యేసు శీఘ్రముగా వచ్చున్ ఆశతో కనిపెట్టుడి (2)
1. గురుతులెల్ల లోకమంతా - సరిగజూడ కాననగున్ (2) పరిశుద్ధమైన ప్రవర్తనతో - ప్రభుకై కనిపెట్టుడి (2)
2. ప్రొద్దు గ్రుంకి వచ్చునేమో - అర్ధరాత్రి యందేమో ఉదయంపు కోడికూతలప్పుడు - వచ్చునేమో కనిపెట్టుడి
3. సిద్ధపడుడి మీరిలలో - మీరు దేవుని సంధింప సిద్ధపడుడి తీర్పునకై - ప్రభువుకై కనిపెట్టుడి
4. పరిశుద్ధులై జీవించుడి - ప్రభుని చిత్తము చేయుడి మరణమేసు నందె సుమ్మా - మేలుకొని కనిపెట్టుడి
5. యేసువలె జీవించుడి - తీసి వేయుడి మలినములన్ మోసంపుటాశల నన్ని విడచి - ఆశతో కనిపెట్టుడి
6. వేషధారణ విడచి - యేసు ముద్రల ధరించి పెండ్లి కుమారుని సంధింప - అందరు కనిపెట్టుడి
7. మేఘములపై వెళ్ళిన ప్రభు - వేగముగ వచ్చునిల సకల శ్రమలను భరించి - హల్లెలూయ పాడుడి