పల్లవి:మహిమయుతుడు మా యేసు రాజు - మహిమదూత సైన్యము తోడ -ఇహకు వచ్చున్ మహానందము (2)
1. ఇమ్మహి అతిశయిల్లు - దూతలు ఆర్భటించ (2) దూత వెల్గుతోడ మేఘముపై యేసు (2)- సమ్మతిన్ రాగా సంధింతుము వేగ ఆ ... ఆనందము (1)
2. బూరశబ్దించగానే - వాంచలు తీరుటకు మిత్రునిచెంత భక్తులందరు చెరి - హర్షంబుతోడ పాడి స్తుతింతుము ఆ ... ఆనందము
3. భూమి గోత్రములును - దేశాధికారులును ఇమ్మానుయేలుచే న్యాయ తీర్పుపొంద - ఇమ్ముగ మేమును చేరుదు మచ్చట ఆ ... ఆనందము
4. వేయేండ్ల రాజ్యమున భూలోక రాజ్యములు తీరిన పిదప మిత్రునితో మేము - జయప్రదులమై నిత్యమేలుదుము ఆ ... ఆనందము