పల్లవి:దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును (2)
1. నీ ప్రభావ బలమును చూడ - నీ పరిశుద్ధాలయమందు (2) నే నెంతో ఆశ తోడ - నీ వైపు కాచియున్నాను (2)
2. నీళ్లు లేక యెండిన చోట - నా ప్రాణము నీ కొరకు దాహము గొని యున్నది - నీ మీద ఆశచేత
3. నిను చూడ నా శరీరం - కృశించి పోవుచున్నది నీ కృప జీవముకంటె శ్రేష్ఠం - నా పెదవులు నిన్ను స్తుతించున్
4. నా పడక మీద నిను దలచి - రాత్రి జాములో ధ్యానించునపుడు క్రొవ్వు మెదడు దొరకినట్లు - నా ప్రాణము తృప్తి నొందుచున్నది
5. ఉత్సాహముతో నా నోరు - నిన్నుగూర్చి పాడుచున్నది నా జీవిత కాలమంత - ఈలాగు నిన్ను స్తుతియించెదన్
6. నా సహాయుడా నీ పేరు - బట్టి నా చేతు లెత్తెదను నీ చాటున శరణు జొచ్చి - ఉత్సాహధ్వని చేసెదను
7. నను చంప వెదకెడి వారు - పాతాళమునకు పోయెదరు ఖడ్గంబునకు గురియై - మరి నక్కలపాలగుదురు
8. దేవుని బట్టి రాజానందించున్ - తన తోడు ప్రమాణము చేయు ప్రతివాడు అతిశయించును - మూయబడు నబద్ధికుల నోరు