1. యేసురాజు వచ్చును దూతలతో వచ్చును - దాసుల పరమున జేర్చుటకు (2) యేసుని ముఖజ్యోతిని జూచెదము (2) జయ ధ్వనులచే నుప్పొంగెదము (2)
2. సంఘ వధువు పెండ్లి కుమారుండేసుతో - మంగళ గీతము పాడును నాడు మహిమలో మనము పాడెదము యేసు స్నేహంపు లోతును రుచియింతుము
3. ముద్ర నొంది శుద్ధులు తెల్ల నంగి ధరించి - శుద్ధుని ముంగిట నిలిచెదరు నాడు స్వర్ణ కిరీటమును దాల్చి అందు పాడుచు ప్రకాశించెదము
4. యేసునే ప్రేమించితి - లోక స్నేహం వీడితి - సదా నా యేసుతో ముచ్చటింతున్ ఆహా! భాసిల్లు మహిమతో ముచ్చటింతున్ నాడు ప్రభు యేసునితో సుఖ మొందెదన్
5. పరలోక బూరధ్వని మ్రోగగానే - పరిశుద్ధులెగిరి వెళ్ళెదరు ఆ సత్యుని కళ్యాణ విందులో -మన మేసుతో నార్భటించెదము