పల్లవి:జీవపు మార్గ జ్యోతివి - సిలువ మోసిన యేసు (1)మహిమ పూర్ణుడవు నీవే - సిలువ మోసిన యేసు (2)
1. శరీరధారివైతివి - నీ ప్రేమను కనుపరచితివి (2) దీనుల నుద్ధరించితివి - సిలువ మోసిన యేసు (2)
2. నీవే మార్గ సత్యమని - నీకు పేరు కలిగెను నిత్యజీవపు దాతవు - పునరుత్థానుడవు నీవే
3. అర్పణ చేసితివి బలిగా - సిలువపై నీ ప్రాణమును కడిగితివి నీ రక్తముతో - సిలువ మోసిన యేసు
4. నీ ద్వారమున జేరితిమి - నీచులము అయోగ్యులము నీకే మహిమ స్తుతి ఘనత - సిలువ మోసిన యేసు
5. కల్వరి మార్గ యాత్రికులం - నీకే జయమని పాడెదము సర్వద నిను స్తుతియించెదము - సిలువ మోసిన యేసు