CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 28

సర్వజనులారా వినుడి - మీరేకంబుగా వినుడి

sarvajanulaaraa vinudi - meerekambugaa vinudi

Psalms 49:1-9

More
Reference recording on YouTube ↗
పల్లవి:సర్వజనులారా వినుడి - మీరేకంబుగా వినుడి (2)
1. లోక నివాసులారా సామాన్యులు ఘనులేమి (2) దరిద్రులు ధనికులేమి సర్వజనులారా వినుడి (2)
2. నా హృదయ ధ్యానము పూర్ణ - వివేకమును గూర్చినది నే పల్కెద జ్ఞానాంశముల - సర్వ జనులారా వినుడి
3. గూడార్థాంశము వినెద - చేతబట్టి సితార మర్మము దెల్పెద నేను - సర్వ జనులారా వినుడి
4. నాకై పొంచిన దోషుల - క్రియలు నన్ను చుట్టన్ ఆపదలో భయపడనేల - సర్వ జనులారా వినుడి
5. తమ ధన సంపదనుబట్టి - పొగడుకొనెడు వారికి నేనేల భయపడవలెను - సర్వ జనులారా వినుడి
6. ఎవడేరీతినైన నిత్యము బ్రతుకునట్లు సోదరుని రక్షించలేడు - సర్వ జనులారా వినుడి
7. వాని నిమిత్తము దైవ - సన్నిధి ప్రాయశ్చిత్తము చేయువాడెవ్వడు లేడు - సర్వ జనులారా వినుడి
8. ప్రాణ విమోచన ధనము - బహు గొప్ప దెన్నటికిని తీరక యుండవలసినదే - సర్వ జనులారా వినుడి

Back to Hebron Seeyonu Geethalu