పల్లవి:నా ప్రియుడు నావాడు నేను అతని వాడను
1. నీవు బహు ప్రియుండవనుచు - దానియేలునకు దివ్యముగ నభయంబిచ్చిన మా - పరమజనకుండా
2. ఈయనే నా సంతసమైన - ప్రియతనయుండు ఈయన మాట వినుడనిన - పరమజనకుండా
3. ఎన్ని సంద్రముల జలరాసుల్ - ఆర్పగలేని ఉన్నతంబైన నీ ప్రేమన్ - ఎన్న మా తరమా
4. కల్వరిన్ చిందించిన నీదు - రక్త ధారలతో కడిగితివి మా పాపములన్ని - కరుణగల క్రీస్తు
5. మా పై నపవాది నదిబోలి - పొర్లిపారినను ముంచి వేయగ జాలదు మమ్ము - మాతో నీ వుండన్
6. క్రొత్త వత్సరమును దానముగా - నిచ్చిన క్రీస్తు క్షణ క్షణం నడిపింతువు మమ్ము - విజయవంతముగా
7. నీదు రాకడ కై దినదినము - వేచియున్నాము నిత్య మహిమలో నీతో మేము - మెరయుచుందుము