పల్లవి:ప్రభువా (2) పాడెద నొక స్తుతి గీతం - ప్రేమించి రక్షించితివి (1) - ప్రభువా ...
1. గత వత్సరంబులోన - కాపాడి నడిపినావు (2) నూతన వత్సరమున - స్తుతియింప చేసినావు (2)
2. యేసయ్యా పలికితివి - ఆ సముద్ర పొంగులలో నిశ్శబ్దముగా యూర - కుండుము నిమ్మళముగా
3. భయపడిన శిష్యులతో - రయమున పలికితివి భయపడకుడి నేనే - ధైర్యము తెచ్చుకొనుడి
4. తుఫాను రేగె త్వరలో - తరంగములు లేచె ఆపితివయ్యా దేవా - ఆపద బాపితివి
5. ముండ్లకు బదులు గొంజి - దేవదారులు మొలచు ఉండును సూచనలుగా - నిత్యంపు ఖ్యాతిగాను
6. అభివృద్ధి జేసెదవు - ప్రభువైన యేసు దేవా అధికంబు మేలులతో - మునుపటి కంటె మరల
7. సిలువలో మా తుఫాను - బలిలో భరించితివి హల్లెలూయ పాడెదను - కలువరి యేసు నాథా