పల్లవి:దేవుని స్తుతించ రండి - గత సంవత్సరమున కాపాడెన్ (2)
అను పల్లవి:కీడు మనలను చేరకను (2) - కోటి కీడుల నుండి కాపాడినట్టి - మహా (1) || దేవుని ||
1. కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము (2) కష్టములబాపి మనల నింక (2) జగమున జీవితులుగ నుంచినట్టి - మహా (1)
2. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేళ్ళను చెసెనుగా నిరతము కాచి చక్కగను - ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి
3. ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఆత్మ దేహములను బలిగ - నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి
4. వత్సరారంభమున నిను మే మొక్కటిగా నారాధింప దైవకుమారా కృపనిమ్ము - మా జీవిత కాలమంతయు పాడి - మహా
5. భూమియందలి మాయలనుండి సైతానుని వలలో నుండి ఆత్మతో నిను సేవింప - నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి
6. ప్రతి సంవత్సరమును మముజూడుము - దుర్గములో మము చేర్చుమయ్యా దాటునపుడు నీ సన్నిధిని చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా - మహా
7. స్తోత్రింతుము ప్రభువా నీ పదముల - సకలాశీర్వదముల నిమ్ము ప్రేమతో ప్రభుతో నుండ - నెట్టి యాపద లేక బ్రోవుమా మెన్ - ప్రభు