CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 237

స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము

stotrinchi keertintumu ghanaparachedamu koniyaadedamu

2 Chronicles 16:9

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తోత్రించి కీర్తింతుము - ఘనపరచెదము - కొనియాడెదము (1)ఆదరించి - కాపాడువాడు - ఈడేర్చువాడు (2) - స్తోత్రించి కీర్తింతుము (1)
1. మనకింత వరకు సహాయపడెన్ - తానప్పగించుకొనె మనకై (1) మనల నడిపెను సుఖముగను (1) తనదు సత్యము నేర్పించి - కనుపాపగ కాచె ఆ ... (2)
2. ఈ ధరలోని నరులలో - యధార్థ హృదయులకు ముదమున తన చిత్తము తెలుపున్ పదిలముగ ప్రభుకన్నులు - పృథివిని పరుగెత్తు
3. అన్ని సమయములలో - కన్నులతో బోధించును నన్ను మార్చెను తప్పినన్ పెన్నుగ హృదయము నాదరించె - అన్న గురుయేసు
4. అగ్ని వంటి కన్నులు - విఘ్నముల నుండి విడిపించు" తగిన సహాయము చేయును ఎక్కాలమందును కునుకవు - మక్కువ పిల్లలకు
5. హాగరును చూచిన కన్నులు - అనేకుల చూచెను శ్రాయేలుల కనికరించె ఎజ్రాకు సహాయపడెన్ - నిద్రించవు నెపుడు
6. నీతిమంతుల జూచె - దాదిబోలి కాచెన్ జ్యోతుల వలె నుండును అతిబలమిచ్చు అవసరతన్ - క్షితినిను విడువడు
7. ఏడు కన్నులు గలవాడు - నాడు నేడు కాపాడును ఎడతెగని చెడుగుల బాపున్ రేడుల నేర్పరచు వాడు - పాడుడి హల్లెలూయా

Back to Hebron Seeyonu Geethalu