CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 232

దేవాది దేవా ప్రభువుల ప్రభూ రాజుల రాజా హల్లెలూయ

devaadi devaa prabhuvula prabhoo raajula raajaa hallelooya

Matthew 14:27, Isaiah 43:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవాది దేవా - ప్రభువుల ప్రభూ - రాజుల రాజా - హల్లెలూయ (2)
1. నీ రక్తముతో విమోచించి - నీ రక్తముతో సంపాదించి (2) పరలోక రాజ్య ప్రజలతో జేర్చి (2) - పరలోక పాటన్ నా కొసగితివి (2)
2. జీవిత నావలో తుఫాను రేగ - భయపడకుడని అభయమునిచ్చి జయప్రదముగా నన్ను నడిపించి - జయజీవితము నా కొసగుచున్న
3. పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి - కరుణతో నీ సొత్తుగా నన్ను జేసి అరమర లేక నన్నాదరించి - పరలోక దర్శనంబిచ్చితివి
4. మరణ పాత్రులం యిద్ధరణిలోన - దురిత ఋణముల స్మరణను మాన్పి ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము - నీ రాజ్యమందు రాజులన్ జేసి
5. శోధనగాధల కష్టములలో - నా దుఃఖములలో నే నేడ్వకుండా నీ దయ నాపై నిండార నింపి - ఓదార్చి నన్ను నీ దారినడుపు
6. ప్రతి వత్సరము దయతోడ నింపున్ - ప్రభు జాడలు సారము జల్లున్ ప్రతి బీడునూ సారము చిలకన్ - ప్రతి పర్వతము ఆనందించున్
7. పరలోక పరశుద్ధ సంఘంబు యెదుట - సర్వశక్తి గల క్రీస్తుని యెదుటపరలోక నూతన గీతము పాడ - జేర్చితివి నన్ నీ జనమునందు

Back to Hebron Seeyonu Geethalu